మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి,మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు మరో అడుగు పడింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బుధవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించేందుకు రాష్ట్ర యూనిట్‌గా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. కులాల వారీగా వార్డుల సంఖ్యను ప్రకటించిన అధికారులు, వార్డులకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ఆయా వార్డులను జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా కేటాయించనున్నారు. కాగా, 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేటాయించగా, బీసీ రిజర్వేషన్ మాత్రం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయించారు. అదేవిధంగా 2019 మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళా రిజర్వేషన్లు కేటాయించారు. కాగా సంక్రాంతి తర్వాత వార్డులకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ చైర్మన్‌ల రిజర్వేషన్లు కూడా వెలువడనున్నాయి.
రిజర్వేషన్లు ఇలా..
మహబూబాబాద్ మున్సిపాలిటీ..
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 3, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 10, జనరల్ రిజర్వుడ్ 8 స్థానాలు కేటాయించారు.
మరిపెడ మున్సిపాలిటీ..
మరిపెడ మున్సిపాలిటీలో మొత్తం 15వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 3, ఎస్టీ జనరల్ 3, ఎస్సీ జనరల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించారు.
డోర్నకల్ మున్సిపాలిటీ..
డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 2, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించారు.
కేసముద్రం మున్సిపాలిటీ..
కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 1, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు.
తొర్రూరు మున్సిపాలిటీ..
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు.
మహబూబాబాద్ పట్టణ వ్యూ
కేటగిరీల వారీగా సంఖ్యను ప్రకటించిన అధికారులు
రాష్ట్ర యూనిట్‌గా చైర్మన్ రిజర్వేషన్


