వైభవంగా ‘గోదారంగనాఽథుల కల్యాణం’
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు, భక్తులు
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
మహబూబాబాద్ రూరల్ : భోగి వేడుకల్లో భాగంగా పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం గోదారంగనాథుస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముత్తేవి వెంకట కృష్ణప్రసాద్, సహ అర్చకుడు మారేపల్లి కౌశిక్ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం ఘనంగా జరిపించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ముఖ్య అతిథులుగా హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గోదారంగనాథుల అనుగ్రహంతో భక్తులు సుఖశాంతులతో జీవించాలని వేడుకున్నారు. కారక్రమంలో గోదా ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పూజలు చేసిన ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ
వైభవంగా ‘గోదారంగనాఽథుల కల్యాణం’


