30 ఏళ్లుగా ఎద్దులతోనే వ్యవసాయం..
రేగొండ: ప్రస్తుత వ్యవసాయంలో ట్రాక్టర్ల పరుగులు.. పవర్ టిల్లర్ల ఉరుకులు.. కోత యంత్రాలే కనిపిస్తాయి. దుక్కి దున్నాలన్నా.. కలుపు తీయాలన్నా.. కోత కోయాలన్నా .. ఇలా ఏ పని చేయలన్నా యంత్రాలు రావాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. కానీ కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన ఆవుల రమేశ్ ఈ వ్యవసాయానికి పూర్తి భిన్నం. 30 సంవత్సరాలుగా ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నాడు. భూమిని దున్నడం.. విత్తనం నాటడం.. కలుపు తీయడం, ఎరువును వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, ధాన్యం, పత్తి, మిర్చి పంటలను ఇళ్లకు తరలించడం వంటి పనులన్నీ ఎద్దులతోనే చేస్తున్నాడు. ఇటీవలే రూ.1.20 లక్షలతో కొత్త జోడెద్దులు తీసుకొచ్చాడు. వాటిని రాముడు, భీముడు పేర్లతో పిలుస్తున్నాడు.


