ఏసీబీ జాయింట్ డైరెక్టర్ విచారణ
భూభారతి
కుంభకోణంపై
జనగామ: రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న భూభారతి కుంభకోణంపై విచారణ చేసేందుకు మంగళవారం ఏసీబీ జా యింట్ డైరెక్టర్, కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ మెంబర్ సింధూశర్మ(ఐపీఎస్) జనగా మ జిల్లా కేంద్రానికి వచ్చారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో పాటు పీఎస్‌ల పరిధిలోని ఎస్‌హెచ్‌వోలతో సమావేశం నిర్వహించారు. భూభారతిలో జరిగిన అవినీతి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.
19మంది రైతులకు నోటీసులు..
కొడకండ్ల: భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యా రు. అక్రమార్కులు కొల్లగొట్టిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసి లోటును పూడ్చుకొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2025లో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మంగళవారం రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు తహసీల్దార్ కోల చంద్రమోహన్‌ను వివరణ కోరగా.. 19 మంది రైతులకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని డబ్బును రికవరీ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చలాన్ డబ్బులను చెల్లించిన తమను బాధ్యులు చేస్తూ నోటీసులిచ్చి డబ్బులు కట్టాలనడమేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


