ఆకట్టుకుంటున్న అమరుడి స్మారక స్తూపం
● స్తూపానికి ఎరుపు, పచ్చ రంగులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని ఊరట్టం జంక్షన్ వద్ద ఓ స్తూపం అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా అమరుల స్తూపానికి ఎరుపురంగువ వేస్తుంటారు. కానీ, పీపుల్స్‌వార్ పార్టీ కాలంలో నిర్మించిన ఈ స్తూపానికి ఎరుపు, పచ్చ రంగులతో అలంకరణ చేస్తున్నారు. జాతర పనుల్లో భాగంగా స్తూపానికి సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి పచ్చ రంగు, చివరన ఎర్రరంగు వేయడం స్థానికులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్తూపం మండల పరిధిలోని మేడారం సమీపంలో గల నార్లాపూర్ గ్రామానికి చెందిన మల్లెల సమ్మయ్య అలియాస్ బుట్టన్నది. ఆయన 22ఏళ్ల క్రితం జనశక్తి పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు సమీ పంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. స్మారకార్థం స్తూపాన్ని ఊరట్టం క్రాస్ వద్ద ఆయన బంధువులు నిర్మించారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆదివాసీయోధుల పోరాట చరిత్రను ప్రతిబింబించేలా స్తూపానికి పచ్చ రంగు, చివరన ఎరుపురంగు వేస్తున్నట్లు తెలిసింది.


