40 ఏళ్లుగా గంగిరెద్దులతోనే జీవనం..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామంలో 40 శాతానికి పైగా కుటుంబాలు గంగిరెద్దులాటతోనే జీవనం గడుపుతున్నాయి. సుమారు 30 కుటుంబాలు దశాబ్దాల కాలంగా గంగిరెద్దులాట కొనసాగిస్తున్నాయి. గ్రామానికి చెందిన జానపాటి వెంకన్న.. ఇంటర్మీడియట్ చదువుతున్న తన కుమారుడు మహేశ్‌తో కలిసి డోర్నకల్ పరిసరాల్లో గంగిరెద్దును తిప్పుతూ భిక్షాటన చేస్తున్నాడు. సంవత్సరంలో సంక్రాంతి సమయంలో పదిహేను రోజులపాటు తమకు ఉపాధి దొరకుతుందని, మిగతా రోజుల్లో కూలీకి వెళ్తామని వెంకన్న చెబుతున్నాడు. గంగిరెద్దులాటకు ఆదరణ తగ్గుతుందని ఆయన పేర్కొన్నాడు. సంక్రాంతి సెలవుల్లో నాన్న వెంట తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తానని మహేశ్ తెలిపాడు.


