వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజవాణిలో 66 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిత్యం తనిఖీలు చేపట్టాలి
నెహ్రూసెంటర్: స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచి పోలీస్, మెడికల్ విభాగాల ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం–1994పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, బాలికలపై వివక్షత, ఎంటీపీ చట్టంపై ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హత లేని ఆస్పత్రులు, వైద్యుల లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, కిట్స్ ద్వారా అబార్షన్‌కు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, కమిటీ సభ్యులు జగదీశ్వర్, డీఎస్పీ తిరుపతిరావు, డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం అధికారి సారంగపాణి, జిల్లా డిప్యూటీ మాస్‌మీడియా అధికారి కె.ప్రసాద్, రాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
ప్రజావాణిలో 66 అర్జీలు


