వాకింగ్‌తో మెరుగైన ఆరోగ్యం
మహబూబాబాద్ అర్బన్: ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతీరోజు 30నిమిషాలు వాకింగ్ చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాకింగ్ పోటీలు నిర్వహించారు. డీఎస్పీ తిరుపతిరావు హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. వయస్సుతో సంబంధం లేకుండా వాకింగ్ చేస్తే శరీరంలోని కొవ్వు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయవచ్చన్నారు. వాకింగ్‌తో గుండె జబ్బులను నివారించవచ్చని, బీపీ, షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చన్నారు. అదేవింధంగా క్రమం తప్పకుండా గంటపాటు వాకింగ్ చేస్తే ఎముకల శక్తి మెరుగుపడుతుందని, కండరాలు బలంగా తయారవుతాయన్నారు. వాకింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాలబిందెల మల్లయ్య, వసంత, మహిపాల్‌రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, సోమన్న, పమ్మిరాజు, సర్వర్‌పాషా, షంశుద్దీన్, జార్జ్, వేణుగోపాల్, మునీర్, వెంకట్‌రెడ్డి, దేవిరెడ్డి, మల్లేశం, సీఐ సర్వయ్య, గౌరవ అధ్యక్షుడు బోనగిరి రవీందరగుప్త తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ తిరుపతిరావు


