ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, పురోగతిపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 79పాఠశాలలు మంజూరయ్యాయని, త్వరగా పూర్తయ్యేలా అధికారులు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన రెండు పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. వీసీలో జిల్లా నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


