వైద్యసేవల పరంగా సహకరిస్తాం..
● బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన
ఆరోగ్యశ్రీ ప్రతినిధులు
రాయపర్తి : బాధిత కుటుంబానికి వైద్య పరంగా సహకరిస్తామని ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ కందికట్ల సంతోష్ తెలిపారు. మండలకేంద్రానికి చెందిన ఐత దాసుబాబు, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు భరత్ మూత్రపిండాలు ఫెయిలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ‘సాక్షి’లో ‘దాతలు దయచూపండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆరోగ్యశ్రీ బృందం స్పందించింది. భరత్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్రమంలో ఇంటికి వచ్చిన తర్వాత భవిష్యత్‌లో వైద్య సేవల పరంగా సహకరిస్తామని సంతోష్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ నిఖిల్‌స్వరూప్, జిల్లా మేనేజర్ విక్రమ్ ఆదేశాల మేరకు ఆరోగ్య మిత్ర జైపాల్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్పంచ్ కందికట్ల స్వప్న, సామాజిక కార్యకర్త ఐత సంపత్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవల పరంగా సహకరిస్తాం..


