అపహరణకు గురైన బాలుడి అప్పగింత
కాజీపేట రూరల్ : కాజీపేటలో ఇటీవల అపహరణకు(కిడ్నాప్) గురైన బాలుడిని పోలీసులు సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. గత డిసెంబర్ 28వ తేదీన బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడి ఆచూకీ తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన తల్లిందండ్రులు లావుడ్యా కన్నానాయక్, నర్సమ్మకు తమ కుమారుడిని అప్పగించారు. దీంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


