క్రీడాసంద్రం.. కాజీపేట రైల్వే స్టేడియం
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేడియం క్రీడాసంద్రంగా మారింది. ఇక్కడ జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నారు. ఈ పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు రాత్రి వరకు 64 జట్లు ఆడాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ మొదటి సారి కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నేషనల్, స్టేట్ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, టీమ్ మేనేజర్లు, రెఫరీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే స్టేడియం కళకళ..
తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం నిర్వాహకులు, ఫెడరేషన్ ప్రతినిధులు, రెఫరీలు, క్రీడాకారులతో కాజీ పేట రైల్వే స్టేడియం కళకళలాడుతోంది. ఈ పోటీలను నగరవాసులు, పలు ప్రాంతాలకు చెందిన క్రీ డా అభిమానులు తిలకించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్–హైదరాబాద్ రూట్‌లో ఆర్టీసీ బ స్సులు, వివిధ ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు, స్థానికులు కాజీపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ద్వారా క్రీడలను తిలకిస్తున్నారు. కాజీపేట చౌరస్తా, కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన ద్వారం కాకతీయ కళాతోరణం, పరిసర ప్రాంతం మొత్తం క్రీడల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో సందడిగా మారింది. మొత్తంగా రాత్రి, పగలు క్రీడాకారుల ఆటలతో కాజీపేట రైల్వే స్టేషన్ కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తోంది.
ఖోఖో క్రీడాకారులతో
కళకళలాడుతున్న కాజీపేట
రెండో రోజుకు చేరిన
జాతీయ స్థాయి పోటీలు
నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్న క్రీడాకారులు
చౌరస్తాలో ఎల్‌ఈడీ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు
క్రీడాసంద్రం.. కాజీపేట రైల్వే స్టేడియం


