కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
● 26 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి
● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి
హన్మకొండ చౌరస్తా: ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్ర భుత్వ ఏర్పాటుకు కష్టపడిన ప్రతీ కార్యకర్తను కా పాడుకుంటాం. పార్టీ కోసం భవిష్యత్‌లో సై తం కష్టపడే కార్యకర్తల సంక్షేమానికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుంది’ అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్‌లో సోమవారం వరంగల్ ప శ్చిమ నియోజకవర్గ స్థాయి పార్టీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాబోయే కా ర్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. గ్రూపు రా జకీయాలకు దూరంగా ఉండి, త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 26 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీని వాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, పోతుల శ్రీమన్నారాయణ, వేముల శ్రీనివాస్, అనుబంధ సంఘాల నాయకులు విక్రమ్, సతీశ్, సరళ, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం


