సౌత్‌జోన్ పోటీలకు కేయూ బాల్‌బ్యాడ్మింటన్ మెన్ జట్టు
కేయూ క్యాంపస్: చైన్నైలోని భారతీదాసన్ యూనివర్సిటీలో ఈనెల 14 నుంచి 17వతేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య సోమవారం తెలిపారు. ఈ జట్టులో ఎస్. అజయ్, కె. గణేశ్, యు. మోహన్, సి. పవన్ కల్యాణ్, బి. నవీన్, పి. రాజేశ్, పి. వికాస్, ఎం.డి. సయ్యద్ ఆదిల్, కె. సిద్దార్థ, ఎం. శ్రీహరి ఉన్నారు. ఈ జట్టుకు యూసీపీఈ కేయూ, ఖమ్మం ఫిజికల్ డైరెక్టర్ పి. మధు కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
కేయూలో ఉమెన్స్ క్రికెట్ ఎంపికలు..
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి సోమవారం ఉమెన్స్ క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు చైన్నెలోని అన్నా యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న, ఫిజికల్ డైరెక్టర్లు వెంకన్న, ఎర్ర సుమన్, అఫ్జల్, వెన్నెల, శ్వేత, సందీప్, గోపి, తదితరులు పాల్గొన్నారు.
మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడి
● నిందితుడి అరెస్ట్, రిమాండ్
ఎల్కతుర్తి: మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మానసిక దివ్యాంగురాలు ఇంటివద్ద ఒంటరిగా ఉంది. గమనించిన దూరపు బంధువు హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన పోలె పాక ప్రభాకర్.. దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ పనులకు వెళ్లి సా యంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ఆమె ప రిస్థితిని గమనించి అడగగా విషయం తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం తెలిపారు.
సౌత్‌జోన్ పోటీలకు కేయూ బాల్‌బ్యాడ్మింటన్ మెన్ జట్టు


