ఘనంగా మాషూఖ్ రబ్బానీ ఉర్సు
ఖిలావరంగల్ : వరంగల్ కరీమాబాద్‌లోని హజ్రత్ మాషూఖ్ రబ్బానీ దర్గాలో 470వ సంధల్ (గంధం) ఉర్సు ఉత్సవాలు సోమవారం రెండోరోజు ఘ నంగా జరిగాయి. దర్గా పీఠాధిపతులు సయ్యద్‌షా హైదర్ హిలాల్‌యొద్దీన్ ఖాద్రీ, సయ్యద్ అలీషా ఖా ద్రీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. మతాలకతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులకు తరలొచ్చి మాషూక్ రబ్బానీ సమాధిని దర్శించుకున్నారు. దీంతో దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దర్గాను దర్శించుకుంటే రోగాలు మాయమవుతా యని భక్తుల నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న మానసిక రోగులు సైతం దర్గాను దర్శించుకోగా..పీఠాధిపతులు ఆశీర్వదించారు. సా యంత్రం 5గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఖురాన్ పఠనంతోపాటు కర్ణాటకలోని బెంగుళూరు చెందిన ముస్లింలు ఉర్సు ఖవ్వాలీ నిర్వహించారు. దర్గా ఎదుట ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్ మరుపల్లి రవి, భక్తులు పాల్గొన్నారు.
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత..
ఏఎస్పీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ నేతృత్వంలో మాషూఖ్ రబ్బానీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పటిష్ట భద్రతాఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో పున్నేలుకు చెందిన సోఫియా, కరీమాబాద్ నానమియా తోటకు అన్సారా తప్పిపోగా.. ఇన్‌స్పెక్టర్ రమేశ్ వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు. తప్పిపోయిన చిన్నారులను క్షణాల్లో పట్టుకుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
రెండో రోజు కొనసాగిన ఉత్సవాలు
మతాలకతీతంగా దర్గాను
దర్శించుకున్న భక్తులు
ఘనంగా మాషూఖ్ రబ్బానీ ఉర్సు


