చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
● సర్పంచ్‌లుగా ఎన్నికై న యువత
● గ్రామపాలనతో రాజకీయ రంగంలోకి..
● తమ మార్క్ చూపేందుకు ప్రణాళిక
● నేడు జాతీయ యువజన దినోత్సవం
యువత రాజకీయాల్లోకి రావాలి
కురవి: ఈమె పేరు బానోత్ లావణ్య. డిగ్రీ వరకు చదువుకున్న ఈ 24 ఏళ్ల యువతి కురవి శివారు రేకుల తండా సర్పంచ్‌గా వివాహం జరిగిన ఐదు నెలలకే ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈమె భర్త బానోత్ వినోద్ అదే గ్రామంలో గత పాలకవర్గంలో ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. గత సర్పంచ్ చంద్యానాయక్ అనారోగ్యంతో ఉన్నసమయంలో సర్పంచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. భర్త చేసిన మంచి పనులతోనే తన విజయం సాధ్యమైందని, మంచినీటి సౌకర్యం, డ్రెయినేజీల ఏర్పాటు, విద్యుత్ దీపాల వెలుగులు, పాఠశాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గంతో కలిసి పాలన సాగిస్తాని చెబుతున్నారు.. ఈ యువసర్పంచ్. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని లావణ్య ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు.
యువకులు రాజకీయాల్లోకి రావాలి.. పాలనలో తమదైన ముద్రవేయాలని ప్రముఖుల ఉపన్యాసాల్లో వింటుంటాం. ఆ మాటలను కొందరు విని వదిలేస్తే.. వీరు మాత్రం ఆ దిశగా అడుగులు వేశారు. అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుని గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతల్లో కొలువుదీరిన యువ సర్పంచ్‌లపై నేడు జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) సందర్భంగా ప్రత్యేక కథనం.
గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
తొడేళ్లగూడెం గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించడం ఆనందంగా ఉంది. 25 ఏళ్లకే భర్త సహకారంతో సర్పంచ్‌గా గెలవడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్న రోజే గ్రామాభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నా. గ్రామంలోని పాఠశాలల అభివృద్ధి, వసతుల కల్పన, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తా. గ్రామాభివృద్ధికి యువత సహకారం అవసరం. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – చౌడబోయిన కల్యాణి, సర్పంచ్, తొడేళ్లగూడెం, డోర్నకల్
పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోనే..
మరిపెడ రూరల్: మండలంలోని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతమ్ 30 ఏళ్ల వయస్సులోనే సర్పంచ్‌గా బాధ్యతలు చేట్టాడు. బీఫార్మసీ చేసిన గౌతమ్ ఉద్యోగం వైపు కాకుండా రాజకీయలవైపు అడుగులు వేసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సర్పంచ్‌గా విజయం సాధించాడు. గతంలో పదవి లేకున్నా ప్రజలకు సేవచేశానని ప్రస్తుతం పొందిన పదవితో ప్రజాసమస్యల పరిష్కారానికి మరింత కృషి చేసే అవకాశం వచ్చిందంటున్నాడు.. గౌతమ్. చదువుకున్న సర్పంచ్‌గా ప్రణాళికతో పనుల చేస్తానని చెబుతున్నాడు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్నారు.. ఈయువ సర్పంచ్.
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కురవి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు.. మండలంలోని మోద్గులగూడెం శివారు బేగావత్ తండా యువసర్పంచ్ బేగావత్ సంతోష్. ఎంబీఏ వరకు చదువుకున్న 29 ఏళ్ల సంతోష్ నూతనంగా ఏర్పాటైన బేగావత్ తండాకు మొదటి సర్పంచ్ కావాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు. తండాలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పనిచేస్తానని, పేదలకు సాయమందించడమే లక్ష్యమని సంతోష్ చెబుతున్నారు. గ్రామంలో తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, వీధిదీపాలు, మౌలిక సదుపాయాలకల్పనకు పాటుపడతానని, యువత విద్యపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. ఈ యువ సర్పంచ్.
నా భర్త చేసిన సేవలే గెలిపించాయి
మహబూబాబాద్ రూరల్: దర్గా తండా సర్పంచ్‌గా నా భర్త చేసిన సేవలే నన్ను ఈ విడతలో సర్పంచ్‌గా గెలిచేలా చేశాయి. నేను ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. గ్రామంలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జీపీ శాశ్వత భవనం నిర్మాణానికి కృషి చేస్తా. అంతర్గత రోడ్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తా. అభివృద్ధిలో యువత భాగస్వామ్యమైతేనే గ్రామాలు ఆదర్శవంతంగా తయారవుతాయి.
– గుగులోత్ సునీత, సర్పంచ్, దర్గా తండా
గూడూరు: మండలంలోని బ్రాహ్మణపల్లి శివారు ఇప్పల్‌తండాకు చెందిన ధారావత్ కమల. బీటెక్ పూర్తి చేసింది. 24 సంవత్సరాల కమల ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండగా వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి భర్త నరేష్ సహకారంతో విజయం సాఽ దించింది. కొత్తగా ఏర్పడిన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై నందుకు సంతోషంగా ఉందని.. గిరిజన తండాలు అభివృద్ధి చెందాలనుకునే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతుంది. రాజకీయ అనుభవం లేకున్నా, విద్యా పరిజ్ఞానంతో ప్రజాప్రతినిధిగా ముందుకెళ్తానంటుంది.. కమల.
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత


