కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో ఆదివారం తొర్రూరు ఆర్టీఓ కార్యాలయం ఏఓ కుమ్మరికుంట్ల అనిల్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు నాగరాజు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో
75 రకాల గుర్తులు
తొర్రూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నగర, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఓటరు తుది జాబితాను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది శిక్షణకు సన్నాహాలు ప్రారంభమయ్యా యి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది. ఈ మేరకు 75 ర కాల గుర్తులున్నాయి. అభ్యర్థుల డిపాజిట్‌లనూ ఖరా రు చేశారు. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, ఇతరులు రూ.2,500, కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5 వేలుగా నిర్ణయించారు.
మహారాష్ట్ర కూలీల సందడి..
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో మహారాష్ట్ర కూలీలతో సందడి నెలకొంది. డోర్నకల్ మండలంతోపాటు కామెపల్లి, కారెపల్లి, ఖమ్మం, సూ ర్యాపేట, మధిర, కూసుమంచి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా పెద్ద సంఖ్యలో డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి రైతులు ఏర్పాటు చేసిన వాహనాల ద్వా రా గ్రామాలకు తరలివెళ్తున్నారు. సుమారు మూడు నెలలపాటు మహారాష్ట్ర కూలీలు మిరప తోటల్లో కాయకోత పనులు చేయనున్నారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు


