మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలి
మహబూబాబాద్ అర్బన్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసేదేవరావు అన్నారు. ఆదివారం పలు మండలాలకు చెందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసేదేవరావు మాట్లాడారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయని, బీజేపీ నాయకులు కౌన్సిర్లుగా, చైర్మన్లుగా గెలిచి బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వరు, ప్రధానకార్యదర్శులు చీకటి మహేష్‌గౌడ్, గడ్డం అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్‌సుందర్‌శర్మ, జిల్లా కన్వీనర్ సింగారం సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకన్న, ఓర్సు పద్మ, మేడి సురేందర్, కోశాధికారి జాటోత్ మోదీన్‌నాయక్, జిల్లా కార్యదర్శులు హిందూ భారతి, అశోక్, మమత, సందీప్, అజయ్‌కుమార్, రేష్మ పాల్గొన్నారు.
కాళేశ్వరాలయంలో సందడి
కాళేశ్వరం: సంక్రాంతి సెలవుల సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందస్తుగా మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది.
● బీజేపీ రాష్ట్ర కోశాధికారి
దేవకీ వాసేదేవరావు
మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలి


