పేదల గుండె ధైర్యం ఉపాధి హామీ పథకం
● డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ
● వీబీజీ రాంజీ బిల్లును నిరసిస్తూ
నిరాహారదీక్ష
మహబూబాబాద్ రూరల్ : పేదల జీవనాధారమైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఈజీఎస్ పేదల గుండె ధైర్యమని డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీ రాంజీ బిల్లును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ మా ట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి, భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చారిత్రాత్మక నిర్ణయం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ అని గుర్తు చేశారు. కేంద్రం పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైందని ఆరోపించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు తగ్గించడం, పనిదినాలు కుదించడం ద్వారా పేదల గుండెల్లో భయం నింపుతోందని విమర్శించారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, బీజేపీ తీసుకొచ్చే ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈజీఎస్ పథకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంద ని, కేంద్రంలో అధికారంలోకి రాగానే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, రాజుగౌడ్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌కుమార్, సురేష్, శ్రీనివాసరెడ్డి, ముసల య్య, సురేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


