అటుకులు.. అదుర్స్
రోజుకు క్వింటా వరకు..
మా మిల్లులో రోజుకు క్వింటా ధాన్యం వరకు అటుకులుగా మార్చుతాం. దీని ద్వారా ఆదాయం లభి స్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వరిపంట సీజన్ అయ్యే వరకు ఉంటాం. చుట్టూ పక్కల మండలాల నుంచి ఇ క్కడి వచ్చి తాజాగా అటుకులను పట్టించుకొని వెళ్తారు. తాజా నాటుఅటుకులు కొ నుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దీనికి డిమాండ్ బాగానే ఉంది.
– మల్లికార్జున్, మిల్లు యజమాని,
ఏటూరునాగారం
ఏటూరునాగారం : మార్కెట్, మార్ట్‌లకు వెళ్లి రెడీగా ఉన్న అటుకులు కొనుగోలు చేసి, నచ్చిన ఆహారాన్ని తయారు చేసుకొని తింటాం. అయితే అటవీ ప్రాంతాలకు చెంది ప్రజలు నాటురకం, సహజసిద్ధంగా తయారైన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం మండల ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు నాటు అటుకులను తయారు చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు.
తయారీ విధానం..
ప్రస్తుతం వరిపంట చేతికి వచ్చే కాలం కావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ధాన్యాన్ని సేకరించి వాటిని 24 గంటల పాటు నీటిలో నానబెట్టి వడ కడతారు. నీరు ఒడిసిపోయిన తర్వాత మండల కేంద్రంలోని 7వ వార్డులో ఏపీకి చెందిన వారు నూతనంగా ఏర్పాటు చేసిన అటుకుల మిల్లు వద్దకు క్యూ కడుతున్నారు. అటుకులను తయారు చేసేందుకు ముందుగా ధాన్యం మేలి రకమైన ఇసుకను జోడించి ఒక పొయ్యి బట్టిలో కంచుడు (మూకుడు)లో వేపుతారు. వేయించిన వాటిని జల్లెడ పట్టి అటుకులు పట్టే మిషన్‌లో వేయడంతో ధాన్యం అంతా కూడా అటుకులుగా మారి బయటకు వస్తాయి. ఇలా అప్పటికప్పుడు తాజాగా ఉన్న అటుకలను ప్రజలు, మహిళలు వారి బస్తాల్లో నింపుకొని ఇంటికి తీసుకు వెళ్తున్నారు.
కిలోకు రూ.15..
కిలో ధాన్యాన్ని అటుకులుగా మార్చినందుకు మిల్లు యజమాని కిలోకు రూ.15 వసూలు చేస్తున్నారు. అదే మిల్లు యజమానికి ధాన్యం అయితే కిలోకు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.1,000 నుంచి రూ.2వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ మిల్లు కేవలం ఫిబ్రవరి 5 వరకు ఇక్కడ సీజన్ వరకు ఏర్పాటు చేశారు. మిల్లులో ఎప్పటికప్పుడు అటుకులను తాజాగా పట్టి ఇవ్వడం వల్ల ప్రజలు ఈ అటుకులను ఇష్టపడుతున్నారు. వీటితో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం ఇక్కడి వారి ప్రత్యేకత.
ఇసుక, ధాన్యం వేరుచేస్తున్న యజమాని
ధాన్యంతో సహజసిద్ధంగా తయారీ
మక్కువ చూపుతున్న ఏజెన్సీ వాసులు
అటుకులు.. అదుర్స్
అటుకులు.. అదుర్స్
అటుకులు.. అదుర్స్


