ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా ..
● ఐదుగురు భక్తులకు గాయాలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ఘాట్ రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక బస్సులో ఆలయం వచ్చారు. గుట్ట ఘాట్ రోడ్డు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి ఆటోలో వస్తుండగా ఘాట్‌రోడ్డు మధ్యలో వాహనం బోల్తాపడి ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వెంటనే ఆలయ అర్చకులు, సిబ్బంది స్పందించి క్షతగాత్రులను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్ ప్రమాదం వివరాలు అడిగి తెసుకున్నారు. కాగా, సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్.. క్షతగాత్రులను పరామర్శించారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
● 15 తులాల బంగారం, రూ.30 వేల నగదు అపహరణ
హసన్‌పర్తి : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన 56వ డివిజన్ గోపాలపురం శివసాయినగర్–1లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శివసాయినగర్–1కు చెందిన దాసరి గోపాలకృష్ణ ధర్మసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని భార్య శ్రావణి కూడా ఉద్యోగి. శనివారం ఉదయం శ్రావణి ఉద్యోగానికి వెళ్లగా.. గోపాల కృష్ణ తన కూతురుని తీసుకుని స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపు ధ్వంసమై కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో భ్రదపరిచిన సుమారు 15 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.30వేలు నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా ఇన్‌స్పెక్టర్ రవికుమార్ హుటిహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసుల జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం క్లూస్ టీమ్ సభ్యులు వేలిముద్రలు సేకరించారు.
ఘటనాస్థలిని సందర్శించిన డీసీపీ
సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ డీసీపీ దార కవిత, సీసీఎస్ ఏసీపీ సదయ్య ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు.
ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా ..
ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తా ..


