జాతరలో వైద్యసేవల్లో ముందుండాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సమష్టిగా పని చేయాలని హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. ఈ మేరకు శనివారం మేడారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, జాతర ఇన్‌చార్జ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి జాతరలో వైద్య సేవల్లో ముందు వరుసలో నిలవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అవసమైన మందులు, మంచాలు, శస్త్రచికిత్స పరికరాలను సమకూర్చుకోవాలని తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా 50 పడకల వైద్య సదుపాయం, 30 ఉచిత వైద్య శిబిరాలు, 40 ఎన్ రూట్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం టీడీడీ మండపంలో 50 పడకలతో ఏర్పాటు చేస్తున్న వైద్యశాలను పరిశీలించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓలు గోపాల్‌రావు, అల్లెం అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు చంద్రకాంత్, రణధీర్, శ్రీకాంత్, సంపత్, డీపీఎంఓ సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్


