ఆలయాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలి
కాకతీయులు అద్భుతంగా నిర్మించిన త్రికూటాయలం కాలగర్భంలో కలిసి శిథిలావస్థకు చేరింది. ఆలయాన్ని పూర్వవైభవంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పునరుద్ధరణ పేరుతో ఆలయాన్ని కూల్చిన పురావస్తుశాఖ అధికారులు రెండు దశాబ్దాలుగా పట్టించుకోక పోవడం దారుణం. పక్కకు పెట్టిన కళాఖండాలలోని కొన్నింటిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి యుద్ధ ప్రాతిపాదికన ఆలయాన్ని పునరుద్ధరించాలి.
–పెండెల ఎల్లయ్య, నిడిగొండ
ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి
ఘన చరిత్ర గల త్రికుటాలయాన్ని పునరుద్ధరణ పేర కళాఖండాలను పక్కనపెట్టి వదిలేశారు. అధికారులను పలు మార్లు కోరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న త్రికుటాలయంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ తీసుకోవాలి. గ్రామస్తులతో కలిసి ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతాం.
– కొంగరి నర్సింగరావు, నిడిగొండ
ఆలయాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలి


