సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు..
ప్రస్తుత సీజన్‌లో సీసీఐ మిల్లర్లపై కక్ష కట్టింది. లేనిపోని నిబంధనలు తీసుకొచ్చి రైతులు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఎల్1, ఎల్2 విధానాలను తీసుకొచ్చి మిల్లర్లలో భేదాభిప్రాయాలను సృష్టించింది. కొన్ని మిల్లులకు అనుమతులు ఇవ్వడం, కొన్నింటికి ఇవ్వకపోవడంతో మిల్లులు బంద్ చేశారు. దీని వల్ల ఆయా మిల్లర్లకు ఆర్థిక భారం పడుతోంది. వసతులు లేని కారణంగా అనుమతులు ఇవ్వడం లేదని సీసీఐ అంటున్నది. షెడ్ లేకుంటే బేల్‌కు రూ.20, ప్రహరీ లేకుంటే బేల్‌కు రూ.10 మినహాయింపు చేస్తామని ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మినహాయించుకుని అన్ని మిల్లుల్లో కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలి. అప్పటి వరకు బంద్ పాటిస్తాం.
– చింతలపల్లి వీరారావు, కాటన్
అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు


