నిబంధనలకు విరుద్ధంగా లారీ పార్కింగ్
రఘునాథపల్లి: నిబంధనలకు విరుద్ధంగా నిడిగొండ క్రాస్‌రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని.. బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడంతోపాటు మరో ఆరుగురు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు ఇసుక తీసుకెళ్తున్న లారీని నిడిగొండ రైల్వే బ్రిడ్జి దిగిన చోట డ్రైవర్ నిలిపి ఉంచాడు. లారీ పార్కింగ్ (ఇండికేటర్) లైట్లు వేయకపోవడం, బ్రిడ్జి దిగే చోట మలుపు ఉండడంతో లారీ నిలిపి ఉన్నట్లు బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని వారు పేర్కొంటున్నారు. బ్రిడ్జి దిగే చోట గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. అయినా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్సై నరేశ్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ధ్వంసమైన బస్సును జేసీబీతో పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. నిర్లక్ష్యంగా రహదారిపై లారీ నిలిపిన డ్రైవర్ మల్లేశ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఘటనాస్థలిని పరిశీలించిన డీసీపీ
నిడిగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీసీపీ రాజమహేంద్రనాయక్ పరిశీలించారు. ఘటన జరగడానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట ఆర్టీఓ జీవీఎస్ గౌడ్, కరీంనగర్ జోన్ ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మేకల రవీందర్, డీఎం స్వాతి, సెక్యూరిటీ సబ్‌ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
బంధువుల శుభకార్యానికి హాజరై వెళ్తూ ..
వరంగల్‌లో బంధువుల శుభకార్యానికి హాజరైన పులమాటి ఓం ప్రకాశ్(75) తిరుగు ప్రయాణంలో మృత్యుఒడికి చేరాడు. మృతుడికి భార్య శాలిని, ఇద్దరు కుమారులు ప్రమోద్‌కుమార్, అరవింద్‌కుమార్ ఉన్నారు.
మామకు వైద్యం చేయించేందుకు..
నవజీత్‌సింగ్ (52)తన మామ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు హైదరాబాద్ వెళ్తూ చనిపోయాడు. మృతుడికి భా ర్య దల్బీర్‌కౌర్, ఇద్దరు కూతుళ్లు గుర్‌లిన్, హర్విన్ ఉన్నారు. మృతదేహాలకు జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున మార్చురీకి చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి.
నిడిగొండ క్రాస్ వద్ద
ఇండికేటర్ లైట్లు వేయని డ్రైవర్
బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృత
నిబంధనలకు విరుద్ధంగా లారీ పార్కింగ్
నిబంధనలకు విరుద్ధంగా లారీ పార్కింగ్
నిబంధనలకు విరుద్ధంగా లారీ పార్కింగ్


