స్పోర్ట్స్‌ కోటాను 4శాతానికి పెంచేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కోటాను 4శాతానికి పెంచేందుకు కృషి

Nov 17 2025 3:47 PM | Updated on Nov 17 2025 3:47 PM

స్పోర్ట్స్‌ కోటాను 4శాతానికి పెంచేందుకు కృషి

స్పోర్ట్స్‌ కోటాను 4శాతానికి పెంచేందుకు కృషి

వరంగల్‌ స్పోర్ట్స్‌: ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి క్రీడల అభ్యున్నతికి ప్రత్యేక క్రీడా పాలసీని అమలు చేస్తున్నారని, ఇప్పుడున్న స్పోర్ట్స్‌ కోటాను 2 నుంచి 4శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఆదివారం ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ను నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, కడియం శ్రీహరి పట్టుబట్టి వరంగల్‌కు తెచ్చుకున్నారన్నారు. స్పోర్ట్స్‌ పాలసీ ద్వారా పారదర్శకంగా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తిస్తామన్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నా యిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితో నే హనుమకొండకు స్పోర్ట్స్‌ స్కూల్‌ మంజూరైందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్‌ స్కూల్‌ను హనుమకొండలో ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధప్రాతిపదికన మంజూరు చేశారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు మా ట్లాడుతూ నేటి యువత మొబైల్స్‌, డ్రగ్స్‌కు వ్యసనంగా మారి ఆటలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా క్రీడాకారిణి జీ వాంజి దీప్తికి సీఎం రేవంత్‌రెడ్డి 500 గజాల స్థలం మంజూరు చేశారని, అయితే ‘కుడా’ ఇప్పటి వరకు కేటాయించలేదని, మంత్రి స్పందించి స్థలం కేటా యించేలా చూడాలని కోరారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌ శివసేనారెడ్డి, వీసీఅండ్‌ఎండీ సోనీబాలదేవి, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రా మ్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, బల్దియా కమిషనర్‌ చౌహత్‌బాజ్‌పేయ్‌, డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

విజయ డెయిరీ పునరుద్ధరణకు

డీపీఆర్‌ సిద్ధం చేయండి..

హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ పునరుద్ధరణ, మరమ్మతుల కోసం డీపీఆర్‌ సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, విజయ డెయిరీ డీడీ శ్రవణ్‌కుమార్‌కు మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. హనుమకొండలోని అలంకార్‌ జంక్షన్‌ సమీపంలోని విజయ డెయిరీ వరంగల్‌ యూనిట్‌ను ఆదివారం మంత్రి పరిశీలించారు. 1969లో 15వేల లీటర్ల సామర్థ్యంతో ఇక్కడ డెయిరీ స్థాపించారని, పెరిగిన పాల సేకరణతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిందని, తద్వారా నాణ్యత నియంత్రణలో సవాళ్లు ఎదరవుతున్నాయని మంత్రికి పలువురు పాడిరైతులు తెలిపారు. రూ.25 కోట్లతో డెయిరీ ఆధునీకరణ, ఉత్పత్తి విస్తరణకు చర్యలు తీసుకోవాని విన్నవించారు. స్పందించిన మంత్రి శ్రీహరి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు ఉన్నారు.

రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

రాష్ట్రంలో 4వ స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement