బోనస్.. నర్వస్
తొర్రూరు రూరల్: సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోసన్ ప్రకటించింది. 2024 వానాకాలం సీజన్‌లో క్వింటా సన్నవడ్లకు రూ.500బోనస్ చెల్లించింది. అయితే బోనస్ వస్తుంది కదా అని యాసంగి సీజన్‌లోనూ 30,253 వేల మంది రైతులు రికార్డు స్థాయిలో 1,34,156 క్వింటాళ్ల సన్న వడ్లను పండించారు. వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా.. కేవలం మద్దతు ధర డబ్బులు మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం నుంచి రూ.67.07 కోట్ల బోనస్ డబ్బుల కోసం ఐదు నెలలుగా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
కొనుగోళ్లు షురూ..
రాత్రి, పగలనకా ఎంతో కష్టపడి సాగు చేసిన వానాకాలం వరి పంట ధాన్యం కొనుగొళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అందిస్తున్న బోనస్ డబ్బులకు ఆశపడి గత వానాకాలం కంటే అధికంగా సన్నాలు సాగు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. కాగా, గత యాసంగి సీజన్‌లో విక్రయించిన ధాన్యానికే ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని, ప్రస్తుతం విక్రయిస్తున్న వడ్లకు ఇస్తారో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గత యాసంగి సీజన్‌తో పాటు ప్రస్తుత ధాన్యానికి సంబంధించి బోనస్ డబ్బులు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
తొందరగా బోనస్ డబ్బులు ఇవ్వాలె
యాసంగిలో పెట్టిన సన్న వడ్ల బోనస్ డబ్బులను తొందరగా ఇవ్వాలె. క్వింటాకు ఐదు వందలు వస్తాయనే ఆశతో పొలం మొత్తం సన్న వడ్లను పండించినం. ఇప్పటికై నా బోనస్ డబ్బులు ఇస్తే వచ్చే పంటకు పెట్టుబడికి ఉపయోగపడుతుంది.
–గుద్దెటి అబ్బయ్య, రైతు
ఐదు నెలలుగా రైతుల ఎదురుచూపులు
జిల్లాలో రూ.67.07 కోట్ల సన్నధాన్యం బోనస్ బకాయిలు
ప్రారంభమైన వానాకాలం
ధాన్యం కొనుగోళ్లు
బోనస్.. నర్వస్
బోనస్.. నర్వస్


