ప్రతీ విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రతీ విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకొని విజ్ఞానాన్ని పెంపొందిచుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మ ణ్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం గ్రంథాలయ వారో త్సవాలు నిర్వహించారు. గ్రంథాలయ పితామహు డు రంగనాథన్ చిత్రపటానికి ప్రిన్సి పాల్, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రి న్సిపాల్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలను ఆధుని క దేవాలయాలుగా భావించి విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. గ్రంథాలయ పాలకుడు డి.రాజశేఖర్, అధ్యాపకులు శ్రీనివాసులు, అనిల్, సాంబశివరావు, మసూద్, హథీరాం, ఉపేందర్, అన్నపూర్ణ, సుమలత, వినోద్, సుమన్ పాల్గొన్నారు.


