దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
● ప్రజావాణిలో 97 అర్జీల స్వీకరణ
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలని, లేనియెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజావాణిలో 97 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


