సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేశ్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ తదితరులు ఉన్నారు.


