మల్లన్న.. మమ్మల్ని కాపాడు
నేడు మకర సంక్రాంతి ప్రత్యేక పూజలు
ఐనవోలు: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భోగి పర్వదినాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం వేలాది మంది భక్తులు మల్లన్న సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి పూజలు చేశారు. స్వామివారి గర్భాలయంలో అర్ధప్రాణ వట్టంపై కొలువైన నిర్వికార శ్వేతలింగానికి విభూధులతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
మల్లికార్జునస్వామి ఉత్సవాల్లో భాగంగా భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషా హాజరయ్యారు. ప్రముఖులందరికీ ఆలయ మర్యాదలతో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈఓ కందుల సుధాకర్, అర్చకులు స్వాగతం పలికారు. వీరు స్వామివారికి ప్రత్యేక దపూజలు చేశారు.
పెద్ద పట్నాలు వేసుకుంటున్న భక్తులు
మల్లన్న ఆలయంలో భక్తులే పెద్ద పట్నాలు వేసుకునే సంస్కృతి క్రమక్రమంగా పెరుగుతోంది. గతంలో ఆలయం వద్ద టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఒగ్గు పూజారులు పట్నాలు వేసేవారు. కానీ ఇటీవల పదుల సంఖ్యలో భక్తులందరూ 11 పలకల పెద్ద పట్నాలు వేస్తున్నారు.
మకర సంక్రాంతి సందర్భంగా గురువారం గర్భగుడిలో ప్రత్యేక పూజలు, మహన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్ర పుష్పం, తదితర పూజలతోపాటు రాత్రి స్వామివారి రథోత్సవం, ప్రభబండ్లు తిరగడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి.
ఐనవోలుకు వేలాదిగా తరలొచ్చిన
భక్తులు
ఆలయంలో ఘనంగా భోగి ఉత్సవాలు
పాల్గొన్న దేవాదాయ శాఖ
మంత్రి కొండా సురేఖ,
పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
మల్లన్న.. మమ్మల్ని కాపాడు
మల్లన్న.. మమ్మల్ని కాపాడు


