సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఎస్‌ఎస్ తాడ్వాయి : సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై బుఽ దవారం మేడారంలోని హరిత హోటల్‌లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ రా మ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 18న మేడారం చేరుకుని ఇక్కడే బస చేస్తారన్నారు. 19న సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభిస్తారన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీపీ, వీఐపీ ప్రొటోకాల్ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్‌కు అప్పగించారు. ముఖ్యమంత్రి భద్రత, రూట్ మ్యాప్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
● రూ.2.39 లక్షల నగదు స్వాధీనం
వరంగల్ క్రైం: పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. బుధవారం పక్కా సమాచారం మేరకు హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డికాలనీలో చొప్పదండి రంజిత్ ఇంట్లో తనిఖీ చేయగా పేకాట ఆడుతున్న 12 మంది పట్టుపడినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి రూ. 2,39,660 నగదు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుపబడిన వారిలో కుమార్‌పల్లికి చెందిన గుంటపడి ప్రదీప్, రాయపురకు చెందిన జనగాం మల్లేష్, రెడ్డి కాలనీకి చెందిన చొప్పదండి రంజిత్, కుమార్‌పల్లికి చెందిన అనిశెట్టి మహేష్, మచిలీబజార్‌కు చెందిన అంబాటి రాజు, గుండ్లసింగారం చెందిన అలువాల ప్రవీణ్‌కుమార్, తేజావత్ సుమన్, కుమార్‌పల్లికి చెందిన వెల్దండి పూర్ణచందర్, చింతాకుల ప్రభాకర్, కాపువాడకు చెందిన దాడి వీరేశం, హనుమన్‌నగర్ చెందిన బొంత రాజు, బొక్కలగడ్డకు చెందిన గాండ్ల దేవేందర్‌లను అరెస్టు చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో సీఐ రాజు, ఆర్‌ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నారు.


