కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..
● వీరబోనం తీసుకొచ్చిన దామెరుప్పుల వంశీయులు
● భోగి వేడుకలతో మొదలైన జాతర
ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బుధవారం భోగి వేడుకలతో ఊపందుకుంది. ఆనవాయితీ ప్రకారం దామెరుప్పుల వంశీయులు స్వామివారికి వీరబోనం సమర్పించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కోడె మొక్కులు చెల్లించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10న స్వామి వారి కల్యాణంతో ప్రారంభం కాగా భోగి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చి గుమ్మడికాయ, నారికేళాలు సమర్పించారు. ముందుగా గండదీపం వద్ద నూనె పోసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శాలివాహన కులానికి చెందిన దామెరప్పుల వంశీలయులు ప్రత్యేకంగా అలకంరించిన ఎండ్లబండ్ల రథాల ద్వారా ఆలయానికి చేరుకొని వీరబోనం సమర్పించారు. అలాగే, కొందరు వాహనాలపై ప్రభలతో ఆలయానికి చేరుకున్నారు. జాతరకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..
కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..
కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..
కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..


