జాతీయ ఖోఖో జాతరలో మనోళ్లు..
కాజీపేట రూరల్ : తెలంగాణలో మొదటిసారి కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 10వ తేదీ నుంచి 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మెన్ అండ్ ఉమెన్ జట్లు ఆడుతున్నాయి. మెన్ జట్టులో వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు, రంగారెడ్డి నుంచి నలుగురు, హైదరాబాద్ నుంచి నలుగురు, ఆదిలాబాద్ నుంచి ఒకరు, మెదక్ నుంచి ఒకరు, నల్లగొండ నుంచి ఒకరు, కరీంనగర్ జిల్లా నుంచి ఒకరు మొత్తం 15 మంది(జట్టు)ఆడుతున్నారు. ఈ జట్టకు కోచ్‌గా బొజ్జం రంజిత్, అసిస్టెంట్ కోచ్‌గా పి.ఆనంద్ కుమార్, మేనేజర్‌గా సతీశ్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ తరుఫున ఆడుతుండడం సంతోషంగా ఉందని క్రీడాకారులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
చాంపియన్‌షిప్‌లో ఏకలవ్య
అవార్డు గ్రహీతలు..
కాజీపేటలో జరుగుతున్న 58వ నేషనల్ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్ర పూణెకు చెందిన ఏకలవ్య అవార్డు గ్రహీతలు ప్రతీక్ వైకర్, సుయాష్ గర్గటే పాల్గొంటున్నారు. వీరు పూణె జట్టు తరఫున ఆడుతున్నారు. వారి గురించి..
● భారతదేశ అత్యున్నత పురస్కారం ఏకలవ్య అ వార్డు గ్రహీత ప్రతీక్ వైకర్ వరల్డ్‌కప్‌లో ఇండి యా ఖోఖో జట్టకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 3 ఇంటర్నేషనల్, 12 సీనియర్ నేషనల్స్, అల్టిమె ట్ ఖోఖో తెలుగు యోధాస్‌కు కెప్టెన్‌గా ఉన్నా డు. 6 ఫెడరేషన్స్ నేషనల్ ఆడారు. లండన్‌లో జ రిగిన సౌత్ ఏషియా వరల్డ్‌కప్ కెప్టెన్‌గా ఉన్నారు.
● మరో ఏకలవ్య అవార్డు గ్రహీత సుయాష్ గర్గటే 4 ఏషియన్ చాంపియన్‌షిప్, ప్రపంచకప్‌లో ఇండియా టీమ్‌లో ఆడారు. 8 సీనియర్ నేషనల్స్, ఫెడరేషన్ కప్ ఆడారు. అల్టిమేట్‌లో ఖోఖో 2 సీ జన్‌లో ప్రాతినిథ్యం వహించారు. 3 నేషనల్స్, 2 ఫెడరేషన్ నేషనల్, 2 టెస్ట్ మ్యాచ్‌లు, ఇండియా–నేపాల్,ఇండియా–ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఆడారు.
58వనేషనల్ సీనియర్ పోటీల్లో
తెలంగాణ క్రీడాకారులు..
వివిధ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం..
15 మందితో జట్టు.. మెరుస్తున్న పలువురు ప్లేయర్లు


