అభివృద్ధికి నిధులు కేటాయించాలి
తొర్రూరు: పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.50 కోట్ల నిధులు అవసరమని కోరగా దానికి సీఎం సమ్మతి తెలిపారు. సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు ఆనందంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ, వేమిరెడ్డి మహేంద్రనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


