ఉపాధ్యాయులకు మెమోలు
కేసముద్రం: మండలంలోని బిచ్యానాయక్ తండా జీపీ పరిధిలోని రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు గురువారం ఆలస్యంగా వచ్చారు. దీంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో కూర్చొని నిరీక్షిస్తుండగా గ్రామస్తులు ఎంఈఓ కాలేరు యాదగిరికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంఈఓ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. కాగా ఉదయం 8గంటలలోపు రావాల్సి న ఉపాధ్యాయులు 8.30గంటల తర్వాత వచ్చినట్లు వెల్లడైందని తెలిపారు. కాగా డీఈఓ రవీందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు ఉపాధ్యాయులు పద్మశ్రీ, రాజుకు ఒకరోజు వేతనాన్ని నిలిపివేస్తూ సంజాయిషీ మెమో ఇచ్చినట్లు తెలిపారు.


