ఆశలు గల్లంతు | - | Sakshi
Sakshi News home page

ఆశలు గల్లంతు

Jan 18 2026 8:16 AM | Updated on Jan 18 2026 8:16 AM

ఆశలు

ఆశలు గల్లంతు

– 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 18 శ్రీ జనవరి శ్రీ 2026

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఫిబ్రవరి 16 నుంచి అమలు

విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తొలగింపు

ఫోన్‌చేసిన వెంటనే

స్పందించాలి

దంతాలపల్లి: అనారోగ్యంతో లేదా ప్రమాదంలో గాయపడ్డవారు ఫోన్‌ చేసిన వెంటనే అంబులెన్స్‌ డ్రైవర్లు స్పందించాలని అంబులెన్స్‌ జిల్లా మేనేజర్‌ బత్తిని సతీష్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అంబులెన్స్‌ను శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. వాహనాల కండీషన్‌ ఎలా ఉందనే వివరాలపై ఆరా తీశారు. ఇబ్బందుల్లో ఉన్నవారు ఫోన్‌ చేయగానే వారికి సేవలు అందించినప్పుడే 108 సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. మనం చేసే పనుల్లో ఫలితాలను వేతకాలే గాని శ్రను చూడొద్దన్నారు. కార్యాక్రమంలో పైలెట్‌ రజినికాంత్‌, ఈఎంటీ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

గూడూరు: మండలంలోని తీగలవేణి జెడ్పీహెచ్‌ఎస్‌ 6వ తరగతి విద్యార్థిని జాటోతు అమ్ములు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ రాణి, హెచ్‌ఎం ఫారూఖ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15న మానుకోట జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ని ర్వహించిన సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ 60 మీటర్ల విభాగంలో అమ్ములు మొదటి స్థానంలో నిలి చింది. అమ్ములును సర్పంచ్‌ రాజునాయక్‌, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

అటవీ జంతువుల

గణనపై అవగాహన

బయ్యారం: బయ్యారం రేంజ్‌ పరిధిలో ఉన్న అటవీజంతువుల గణనను నిర్వహించేందుకు శనివారం నామాలపాడు అటవీప్రాంతంలో అటవీసిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీశాఖాధికారి సువర్చల అటవీజంతువుల లెక్కింపు విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో డీఆర్వోలు రమేష్‌, రవి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో ఉండాలి

మహబూబాబాద్‌ రూరల్‌ : రైతులకు వ్యవసా య అధికారులు అందుబాటులో ఉండాలని జి ల్లా వ్యవసాయ అధికారి బి.సరిత అన్నారు. వ్య వసాయ కార్యక్రమాలపై జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, మరిపెడ, మ హబూబాద్‌ డివిజన్‌ సహాయ సంచాలకులతో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో శని వారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ సరిత మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై రైతులకు అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలని తెలిపారు. రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, పీఎం కిసాన్‌ పథకాలపై మండలాల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో మహబూబా బాద్‌, మరిపెడ ఏడీఏలు శ్రీనివాసరావు, విజ య్‌చంద్ర పాల్గొన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. నేనే చైర్మన్‌ అభ్యర్థి.. పీఠం నాదే.. అనుకొని గత రెండు సంవత్సరాలుగా ఆర్భాటం చేసిన పలువురు నాయకులకు శనివారం ప్రకటించిన మున్సిపల్‌ రిజర్వేషన్లు నిరాశ కలిగించాయి. ఇంతకాలం డబ్బులు ఖర్చుచేసుకొని.. అందరిని బతిమిలాడుకుంటూ వస్తే.. రిజర్వేషన్‌ అనుకూలించకపాయే.. అనే ఆవేదనతో ఉన్నారు.

మానుకోట నాయకుల ఆశలపై నీళ్లు

మారుమూల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్‌.. జిల్లా కేంద్రం కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో ఈ సారి మున్సిపల్‌ పీఠం దక్కించుకోవాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ముందస్తు ప్రణాళికతో వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు.. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని, తానే మున్సిపల్‌ చైర్మన్‌ అవుతానని పార్టీ నాయకులు, అనుచరులతో చెప్పుకుంటూ వచ్చారు.. సీఎం, మంత్రుల సభల సందర్భంగా ప్రత్యేకతను చాటుకునేలా ప్రయత్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో అనుబంధం పెంచుకొని చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవసరమైతే పట్టణంలోని వార్డుల్లో తమ అనుచరులను బరిలో దింపి వారి ఖర్చుకూడా భరించి గెలిపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. కానీ రిజర్వేషన్‌ అనుకూలించలేదు. మహబూబాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

కేసముద్రంలో ఇలా..

జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కేసముద్రం. ఇక్కడ మొదటి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై కన్నేసిన నాయకులు ముందునుంచే గాడ్‌ ఫాదర్స్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి జనరల్‌ కేటగిరి అయితే ముఖ్యనాయకుడి అనుచరుడికి అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. బీసీ అయితే నేనే అంటూ మరొక నాయకుడు ప్రచారం చేసుకున్నారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరి చైర్మన్‌ పదవి కావాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కూడా పట్టణంలో బలమైన నాయకుడు పోటీ పడ్డారు. కానీ, ఇక్కడ రిజర్వేషన్‌ ఎస్టీ మహిళకు కేటాయించడంతో అందరి అంచనాలు తారుమారయ్యాయి.

తొర్రూరు, మరిపెడలో పెరుగుతున్న పోటీ..

తొర్రూరు మున్సిపాలిటీ జనరల్‌ కేటగిరికి, మరిపెడ జనరల్‌ మహిళకు కేటాయించారు. దీంతో ఇప్పటి వరకు పోటీ పడ్డ వారే కాకుండా.. కొత్త నాయకుల పేర్లు ముందుకొస్తున్నాయి. మరిపెడ మున్సిపాలిటీ ఎస్టీ రిజర్వ్‌ అవుతుందని భావించిన నాయకులు తమ అనుచరులతో చెప్పుకొని అన్ని సమకూర్చుకున్నారు. అయితే అక్కడ జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఎస్టీ, బీసీ నాయకులు వెనకడుగు వేయక తప్పడంలేదు. ఇక్కడినుంచి మాజీ మంత్రి రెడ్యానాయక్‌ ముఖ్య అనుచరులతోపాటు, రెడ్డి సామాజిక వర్గంనుంచి మరొక నాయకులు చైర్మన్‌ పదవికోసం పోటీ పడుతున్నారు. తొర్రూరులో ఇప్పటికే కాంగ్రెస్‌లో రెబల్‌ బెడద ఉంది. దీనికి తోడు.. జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ కావడంతో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి అర డజన్‌కు పైగా నాయకులు చైర్మన్‌ పదవికోసం పోటీ పడుతున్నారు.

డోర్నకల్‌ నాయకుల ఆశలు గల్లంతు..

డోర్నకల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవికోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పోటీ పడ్డారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి పోటీపడ్డ నాయకులు స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించారు. జనరల్‌ అయితే పోటీలో ఉండేందుకు ఎస్టీ సామజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు తమ అభిప్రాయాలను ఇరు పార్టీల పెద్దలకు చెప్పినట్లు ప్రకారం. ఇక మార్వాడి జైన్‌ సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ, ఇక్కడ ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో అందరి ఆశలు గల్లంతయ్యాయి.

మున్సిపల్‌ చైర్మన్‌

రిజర్వేషన్‌ ఇలా..

కేసముద్రం

ఎస్టీ(మహిళ)

తొర్రూరు

జనరల్‌

డోర్నకల్‌

ఎస్సీ(జనరల్‌)

చిన్నగూడూరు: కాంట్రాక్టర్‌తో మాట్లాడుతున్న ఎంఈఓ రవికుమార్‌

పెద్దవంగర: పాఠశాల గేటుకు తాళం వేసి

నిరసన వ్యక్తం చేస్తున్న సంతోష్‌

పెద్దవంగర: ప్రభుత్వ పనులకు చేసిన బిల్లులు చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసనకు దిగాడు. బాధితుడు సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు గతంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌గా సంతోష్‌ బాధ్యతలు చేపట్టాడు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలో డైనింగ్‌ హాల్‌, మేజర్‌, మైనర్‌ పనులతోపాటు ఎలక్ట్రికల్‌ పనులు చేపట్టాడు. ఈ పనులకు మొత్తం రూ.18 లక్షల వ్యయం కాగా ఇప్పటి వరకు కేవలం కొంత మొత్తం చెల్లించారు. ఇంకా రూ.9.5 లక్షలు బకాయి ఉండగా ప్రభుత్వం మారిన కారణంగా తనకు రావాల్సిన మిగిలిన బిల్లులు నిలిచిపోయాయి. దీంతో చేసేది ఏమిలేక శనివారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపాడు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కొద్దిసేపటి తర్వాత తానే తాళం తొలగించాడు.

బిల్లులు చెల్లించాలి

చిన్నగూడూరు: గత ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పనులు చేసి మూడేళ్లు కావస్తున్నా బిల్లులు చెల్లించలేదని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కాంట్రాక్టర్‌ ధారాసింగ్‌ శనివారం తాళం వేసి ఆవేదనను స్థానిక విలేకరులతో తెలిపాడు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు మన ఊరు–మన బడి కింద ఎంపిక కాగా సుమారు రూ.4.50 లక్షలతో పనులు చేపట్టినట్లు తెలిపాడు. ప్రభుత్వం మారడంతో నేటికీ బిల్లులు రాక లక్షల రూపాయలు అప్పు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. బిల్లులు రాకపోవడంతో పాఠశాలకు తాళం వేసినట్లు తెలిపాడు. ఎంఈఓ రవికుమార్‌ బిల్లుల విషయమై జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో తాళాలు తీసినట్లు తెలిపారు.

రిజర్వేషన్‌ కలిసిరాకపోవడంతో నేతల నిరాశ

మున్సిపల్‌ పీఠంపై కన్నేసిన నాయకులు

నాయకులను మెప్పుకోసం భారీగా ఖర్చు

రిజర్వేషన్ల ప్రకటనతో అయోమయం

మరిపెడ, తొర్రూరులో నాయకుల క్యూ

ఆశలు గల్లంతు1
1/6

ఆశలు గల్లంతు

ఆశలు గల్లంతు2
2/6

ఆశలు గల్లంతు

ఆశలు గల్లంతు3
3/6

ఆశలు గల్లంతు

ఆశలు గల్లంతు4
4/6

ఆశలు గల్లంతు

ఆశలు గల్లంతు5
5/6

ఆశలు గల్లంతు

ఆశలు గల్లంతు6
6/6

ఆశలు గల్లంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement