సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు..
ఏటూరునాగారం: మేడారం హరిత హోటల్ నుంచి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. నేటి(ఆదివారం) సీఎం పర్యటనలో భాగంగా అన్ని రోడ్లును శుభ్రం చేసి ముస్తాబు చేస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ వద్ద కూడా ఆదివాసీ గుర్తులు కేటాయించారు. త్రిశూలం, కొమ్ములు, చక్రం వంటి గుర్తులతో స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు మొత్తం జిగేల్‌గా కనిపించనుంది. గతంలో రోడ్డు చీకటిగా కనిపించేంది. ఇప్పుడు ఏ రోడ్డు చూసిన ప్రకాశవంతంగా కనిపిస్తోంది.
గిరిజన నృత్యాలతో రిహార్సల్..
సీఎం, మంత్రులు సంస్కృతి కార్యక్రమాలు తిలకించనున్న నేపథ్యంలో శనివారం మేడారంలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాల రిహార్సల్ చేపట్టారు. మంత్రి సీతక్క, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆ నృత్యాలను తిలకించి పలు సూచనలు చేశారు.


