గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో గెలిచిన లంబాడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని, అత్యధికంగా ఉన్న గిరిజన జిల్లా మానుకోటలో ఐటీడీఏను ఏర్పాటు చేసి లంబాడ సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రామ్ నాయక్ అన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో గిరిజన హక్కుల సాధనకు శనివారం జిల్లా కేంద్రంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన చట్టాలను వందశాతం అమలు చేయాలన్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే భర్తీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసునాయక్,, ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీనాయక్, మల్సూర్‌నాయక్, భూక్య శ్రీనునాయక్, బాలు, శంకర్‌నాయక్, గుగులోత్ భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ
అధ్యక్షుడు దాస్‌రామ్‌నాయక్


