రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

పెద్దకడబూరు: కారు ఢీకొని ఓ ద్విచక్రవాహనదా రుడు దుర్మరణం చెందాడు. బుధవారం మధ్యా హ్నం మంత్రాలయం మండలం ఓం నగర్‌ సమీపంలో ఈఘటన చోటు చేసుకుంది. మాధవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు..పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాకలి తిక్కయ్య(45) ద్విచక్ర వాహనంపై మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామం వెళ్తుండగా ఓంనగర్‌ గ్రామం సమీపంలో మంత్రాలయం నుంచి ఆదోని వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కారు డ్రైవర్‌ అజాగ్రత్తతో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తిక్కయ్యను చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతిడికి భార్య శాంతమ్మ, కొడుకు, కూతురు సంతానం. మృతిడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement