గురు రాఘవేంద్రయా.. పాహిమాం!
మంత్రాలయం: ‘గురు రాఘవేంద్రాయా.. పాహిమాం’ అంటూ భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు నైవేద్యం సమర్పించారు. బంగారు కవచధారణలోని శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని భక్తులు దర్శనం చేసుకోని మొక్కులు తీర్చుకున్నారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు.
వైభవంగా నవరత్న రథోత్సవం
భక్తుల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ మఠం ప్రాంగణంలో నవరత్న రథోత్సవంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో ఊంజలసేవ నిర్వహించారు.
గురు రాఘవేంద్రయా.. పాహిమాం!


