హదీస్‌ వెలుగు : | - | Sakshi
Sakshi News home page

హదీస్‌ వెలుగు :

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

హదీస్

హదీస్‌ వెలుగు :

హదీస్‌ వెలుగు :

న్యూస్‌రీల్‌

జిల్లా ఉపాధి కల్పన సంస్థ లెక్కల ప్రకారం నిరుద్యోగుల వివరాలు

శిక్షణ కరువై.. ఉపాధి దూరమై!

డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోవడం మహా పాపం. ఈ హరామ్‌ సొమ్ముతో ఏ శుభకార్యం చేసినా అల్లాహ్‌ అంగీకరించరు. వడ్డీ లావాదేవీల నుంచి దూరంగా ఉండండి. – పవిత్ర ఖురాన్‌

శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కర్నూలు(అగ్రికల్చర్‌): అర్హతకు తగిన ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఊసే లేకుండాపోయింది. చంద్రబాబు తమను దారుణంగా మోసగించారని నిరుద్యోగులకు ఇప్పటికే అర్థమైపోయింది. జిల్లా ఉపాధి కల్పన సంస్థలో దాదాపు 49వేల మంది ఉపాధి కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ సంస్థ ద్వారా ఒక్కరికీ ఉద్యోగం లభించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిన ఈ కార్యాలయం ప్రయివేటు ఉద్యోగాల కల్పనకు జాబ్‌ మేళాలు నిర్వహిస్తోంది. జిల్లాలో కేవలం 1,600 టీచర్‌ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించామంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్లలోనే జిల్లాలో 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని నేడు నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.

డీలా పడిన సిల్క్‌ హబ్‌లు, స్కిల్‌ కాలేజీలు

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక స్కిల్‌ హబ్‌, పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ కాలేజీ ఏర్పాటయ్యాయి. స్కిల్స్‌ను పెంపొందించేందుకు అన్ని హబ్‌ల్లో ప్రత్యేకంగా ల్యాబ్‌లు కూడా ఏర్పాటయ్యాయి. స్కిల్‌ హబ్‌లో శిక్షణ పొందిన వారు దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థల్లో నేటికీ రాణిస్తుండటం విశేషం. అయితే చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలకు గండికొడుతోంది. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్కిల్‌ హబ్‌లు తూతూ మంత్రంగా మారిపోయాయి. కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు వద్దనున్న డీఆర్‌డీఏ శిక్షణా కేంద్రాన్ని స్కిల్‌ కాలేజీగా కొనసాగిస్తున్నా రొటీన్‌గా జరిగే శిక్షణా కార్యక్రమాలు మినహా ఇతరత్రా నైపుణ్యాలను పెంచే శిక్షణలు కరువయ్యాయి. నంద్యాల జిల్లాలో అస్సలు స్కిల్‌ కాలేజీనే లేకపోవడం గమనార్హం.

జాబ్‌మేళాలకే పరిమితం

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 2024 సెప్టెంబర్‌ నుంచి నియోజకవర్గాల వారీగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ, ఎంప్లాయ్‌మెంట్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీలు నియోజకవర్గాల వారీగా నెలకు 8 ప్రకారం జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తున్నా ప్లేస్‌మెంట్‌లు అంతంతమాత్రమే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా స్కిల్‌ హబ్‌లు, స్కిల్‌ కాలేజీల ద్వారా 213 మంది, మెగా జాబ్‌మేళా ద్వారా 1,288 మందికి ప్రయివేటు సంస్థల్లో ప్లేస్‌మెంట్‌ చూపించినట్లు లెక్కలు ఉన్నాయి. ఎంప్లాయ్‌మెంట్‌ ద్వారా 104 జాబ్‌ మేళాలు నిర్వహించినట్లు లెక్కలు చూపుతున్నారు. ఇందులో 499 కంపెనీలకు సంబంధించి 25,530 ఖాళీలు ఉండగా.. జాబ్‌ మేళాలకు 12,879 మంది హాజరయ్యారని, 4418 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు వెల్లడించారు. డీఆర్‌డీఏ సీడాప్‌ ద్వారా ప్రయివేటు సంస్థలను పెంచి పోషిస్తోంది. 2014–15 నుంచి 2018–19 మధ్య కాలంలో డీఆర్‌డీఏ ద్వారా నిరుద్యోగుల్లో స్కిల్‌ పెంచేందుకు ప్రయివేటు సంస్థలను పెంచి పోషించింది. ఇప్పుడు కూడ అదే తరహాలోనే శిక్షణల పేరుతో ప్రయివేటు సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు.

కేంద్రం నుంచి సహకారం శూన్యం

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో యువతలో నైపుణ్య శిక్షణకు కేంద్రం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసిల్‌ యోజన( డీడీయుజీకేవై) కింద సహకారం లభించింది. చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ ఇంతవరకు డీడీయుజికేవైకి కేంద్రం ఆమోదం లభించ లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. 2014–2019 మధ్య టీడీపీ హయాంలో కాగితాల మీద మినహా యువతలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ పేరిట నాటి పాలకులు నిధులు కొల్లగొట్టారు.

పురుషులు 37,812

మహిళలు 9,705

ఎస్సీలు 10,341

ఎస్టీలు 1,038

ఓబీసీ 18,018

రెండేళ్లకే బట్టబయలైన చంద్రబాబు మోసం

డీలాపడిన స్కిల్‌ హబ్‌లు, స్కిల్‌ కాలేజీలు

జాబ్‌మేళాలు మినహా కనిపించని నైపుణ్య శిక్షణ

ప్లేస్‌మెంట్‌ పొందినా ఒకటి,

రెండు నెలలకే వెనక్కు

అతీగతీ లేని నైపుణ్య గణన

దిష్టిబొమ్మలా ఉపాధి కల్పన సంస్థ

పోతున్నారు.. వెనక్కి వస్తున్నారు..

డీఆర్‌డీఏ, ఎంప్లాయ్‌మెంట్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా నిర్వహించిన జాబ్‌ మేళాలో ఎంపికై న వారిలో కొందరిని కార్పొరేట్‌ జ్యువెలర్స్‌ దుకాణాలకు పంపించారు.

ఒకటి, రెండు నెలల్లోనే సగం మంది బయటికి వచ్చేశారు.

స్కిల్స్‌ లేకపోవడం వల్ల వినియోగదారులను తమ మాటలతో మెప్పించలేకపోవడం, వ్యాపారంలో టార్గెట్‌లు సాధించకపోవడం కారణమైంది.

12 గంటలకు పైగా పని ఒత్తిడి.. పనికి తగ్గ వేతనాలు లేకపోవడంతో నెల, రెండు

నెలల్లోనే ఇంటి ముఖం పట్టారు.

ఒక్క జ్యువెలర్స్‌లోనే కాదు.. పలు ప్రయివేటు కంపెనీలకు వెళ్లిన వారిదీ ఇదే పరిస్థితి.

ఈ ఏడాది జాబ్‌మేళా ద్వారా ఎంపికై న వారిలో 20 శాతం మంది తమ ప్లేస్‌మెంట్లలో రాణించలేకపోవడం గమనార్హం.

హదీస్‌ వెలుగు : 
1
1/1

హదీస్‌ వెలుగు :

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement