విద్యారంగంపై నిర్లక్ష్యం
ఊరటనివ్వని బడ్జెట్
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు నాయుడు మరోసారి నిరుద్యోగులు, మహిళలను మోసం చేశారు. మూడోసారి ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనైనా ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయిస్తారని మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇక ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా ఆ మాటే ఎత్తకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ప్రాధాన్యత రంగాలకు సరైనా కేటాయింపులు లేకపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కేవలం కొన్ని సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ పెట్టుకొని సంక్షేమం, అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, యూనివర్సిటీల పెండింగ్ పనులు, కర్నూలు స్మార్ట్‌సిటీ, హజ్‌హౌస్, ప్రతిపాదిత హైకోర్టు బెంచ్ తదితరాలను విస్మరించారు. ఇదిలాఉంటే దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించినా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పకపోవడం గమనార్హం.
ఆడబిడ్డ నిధి లేదు..
నిరుద్యోగ భృతి మాటెత్తరు
2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌తోపాటు కూటమి పార్టీల నేతలు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామన్నారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి ప్రతియేడాది జనవరిలో జాబ్ క్యాలెండర్‌తోపాటు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు హామీ తప్పించారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలు ఆగితే మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్నా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై మహిళలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8.25 లక్షల మంది 18 ఏళ్లు నిండిన మహిళలు, 18 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా చంద్రబాబు ప్రభుత్వ తీరుపైఐ మండిపడుతున్నారు.
చంద్రబాబు వేసిన
గుండ్రేవుల శిలాఫలకం వెక్కిరిస్తోంది
2019 ఎన్నికల ముందు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు గుండ్రేవుల, వేదవతి సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అప్పట్లో అడుగు ముందుకేశారు. అయితే ఇప్పుడు ఆయన వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడంలేదు. ఈబడ్జెట్‌లోనైనా నిధులు వస్తాయని ఆశించినా ఆశలు ఆడియాశలయ్యాయి. జిల్లాలోని మొత్తం పెండింగ్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు మొత్తం రూ.9900 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
కర్నూలు సర్వజన ఆసుపత్రిపై చిన్నచూపు
అనూహ్యంగా ఆదోని మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేయడానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. అయితే ఆదోని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్‌లో ప్రైవేట్‌కు ఇవ్వాలని అనుకున్నా ప్రభుత్వం నిధుల కేటాయింపు ద్వారా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 1852 నుంచి ఆరు జిల్లాల పేద ప్రజలకు సంజీవనిగా నిలుస్తున్న కర్నూలు సర్వజన ఆసుపత్రిపై బడ్జెట్‌లో చిన్నచూపు చూశారు. ఆసుపత్రి స్థాయిని పెంచి సౌకర్యాలు కల్పించడంపై ఆసక్తి చూపని పరిస్థితి. కాగా, కర్నూలులో 30 పడకలతో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీల్లోని అసంపూర్ణంగా ఉన్న భవన నిర్మాణాలకు అరకొరగా నిధులు ఇచ్చారు. అయితే ఆయా యూనివర్సిటీల అభివృద్ధి, సిబ్బంది నియామకాలను విస్మరించారు. బనవాసి లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల స్థాపన, ప్రతిపాదిత మైనారిటీ స్టడీ సర్కిల్‌ను పక్కనపెట్టినట్లయింది.
మరోసారి మహిళలు, నిరుద్యోగులను
మోసగించిన బాబు
ఊసేలేని నిరుద్యోగ భృతి,
ఆడబిడ్డ నిధి పథకాలు
సూపర్‌సిక్స్‌లో మేజర్ పథకాలకు
మరోసారి మొండిచేయి
గుండ్రేవుల, రాయలసీమ ఎత్తిపోతల
ప్రస్తావనే కరువు
పారిశ్రామిక అభివృద్ధికి దక్కని
కేటాయింపులు
కర్నూలు స్మార్ట్‌సిటీ, హైకోర్టు బెంచ్,
హజ్‌హౌస్‌ల దాటవేత
హైకోర్టు బెంచ్, హజ్ హౌస్‌లపై దాటవేత
ఏడాది క్రితమే మంత్రి టీజీ భరత్ హైకోర్టు బెంచ్ కోసం ఏబీసీ క్వార్టర్లలో ఉన్న వారిని ఖాళీ చేయించేందుకు తన అధికారాన్ని వినియోగించి నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టారు. అయితే ఇప్పుడు బడ్జెట్‌లో కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటన చేయకపోవడం గమనార్హం. అలాగే కర్నూలు ఎయిర్‌పోర్టు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఇక్కడ రాత్రి పూట కూడా విమానాల ల్యాండింగ్, ఎయిర్‌పోర్టు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నా ఆ ఊసెత్తలేదు. కాగా, ఆళ్లగడ్డ మండలం అహోబిళం నరసింహస్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రైతాంగానికి అరకొర నిధులే..
అన్నదాత సుఖీభవకు నిధులతోపాటు రూ.30 వేల కోట్లతో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కుశ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి మరింత తోడ్పాటు అందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రైతులకు సంబంధించి ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర పథకాలకు అరకొరగా నిధులు కేటాయించడంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
విద్యారంగంపై నిర్లక్ష్యం
విద్యారంగంపై నిర్లక్ష్యం
విద్యారంగంపై నిర్లక్ష్యం
విద్యారంగంపై నిర్లక్ష్యం
విద్యారంగంపై నిర్లక్ష్యం


