మల్లన్న చెంత భక్తుల అవస్థలు
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారులు తిష్టవేయడంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్షేత్ర పరిధిలో పలుచోట్ల వాహనాల కోసం పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినప్పటికీ కొంత మంది వాహనదారులు చలువ పందిళ్ల కింద వాహనాలు నిలపడంతో భక్తులకు ఉపయోగ పడటం లేదు. పుష్కరిణికి సమీపంలో భక్తుల సౌకర్యార్థం షవర్‌బాత్‌లను ఏర్పాటు చేశారు. షవర్‌బాత్‌లకు ఇరువైపులా మహిళలు దుస్తులు మార్చుకునే గదులను షామియానాల టెంట్‌లతో ఏర్పాటు చేశారు. అయితే ఆ షామియానాలకు పెద్ద పెద్ద రంధ్రాలు పడటంతో వాటిని ఉపయోగించుకోలేక పోతున్నారు. ప్రధాన జంక్షన్ అయినా నందిసర్కిల్ వద్ద పోలీసులు పికెట్ పేరుతో పోలీసు బూత్ ఏర్పాటు చేసినా అక్కడ ఎవరూ విధులు నిర్వర్తించకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
– శ్రీశైలంటెంపుల్
మల్లన్న చెంత భక్తుల అవస్థలు
మల్లన్న చెంత భక్తుల అవస్థలు


