మిర్చి రైతు కన్నీరు
సంజామల: మిర్చి సాగు చేసిన రైతులు నీటి సమస్యతో ఆందోళన చెందుతున్నారు. సంజామల మండలం ముదిగేడు గ్రామం పరిధిలోని ఎస్సార్‌బీసీ 10వ బ్లాక్ కింద దాదాపు వంద ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ఈ కాల్వలో నీటి ప్రవాహం తగ్గిపోతుండటంతో పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేయగా ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. ఒక నెల ఉంటే ఎండు కాయ ఇంటికి వచ్చే సమయంలో సాగునీటి సమస్య వేధిస్తోంది. నీటి విడుదలపై అధికారులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌లో తెగుళ్ల బారిన పంటను దున్నేసి నష్టపోయామని వాపోయారు. రబీలో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీరిచ్చి ఆదుకోవాలని ముదిగేడు రైతులు కోరుతున్నారు.
ఎస్సార్‌బీసీ 10వ బ్లాక్‌లో
తగ్గిన నీటి ప్రవాహం
ఆందోళనలో ముదిగేడు మిర్చి రైతులు
మిర్చి రైతు కన్నీరు


