ఉన్నతాధికారుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఉన్నతాధికారుల పరిశీలన

Feb 15 2026 6:54 AM | Updated on Feb 15 2026 6:54 AM

ఉన్నతాధికారుల పరిశీలన

ఉన్నతాధికారుల పరిశీలన

శ్రీశైలంటెంపుల్‌: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన ఘట్టం మహాశివరాత్రి పర్వదినాన పాగాలంకరణ, కల్యాణోత్సవం. అయితే ఆయా ముఖ్యమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు లక్షన్నర మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ మేరకు కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ సునీల్‌ షోరాన్‌ పాగాలంకరణ, క్యూలైన్లనపు పరిశీలించారు. దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను పోలీసు శాఖ సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణకట్ట ద్వారా భక్తులకు అందుతున్న సేవలను కలెక్టర్‌ రాజకుమారి పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం చేరుకుని సీసీటీవీ కెమెరాల ద్వారా ఆలయ ప్రాంగాణం, క్యూలైన్లు, పాతాళగంగ స్నానఘట్టాలు, వసతిగృహాలు, ప్రధాన రహదారులు తదితర ప్రాంతాల్లో పరిస్థితులను జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌తో కలిసి పరిశీలించారు. టోల్‌గేట్‌ రుసుము మినహాయింపు, 24గంటల పాటు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement