బ్రహ్మమురారి.. సురార్చితలింగం
పాతాళగంగకు పోటెత్తిన భక్తులు
శ్రీశైలవాసా.. శరణు మల్లన్నా.. అంటూ భక్తకోటి మల్లన్న ముంగిట ప్రణమిల్లుతోంది. అదిగదిగో శ్రీశైలం.. అంటూ శివయ్య దండు నల్లమల మీదుగా నడిచివస్తోంది. జయ జయ మహాదేవా.. శంభో సదా శివ.. అంటూ నెత్తిన ఇరుముడులతో శివ స్వాములు శ్రీగిరిలో అడుగుపెడుతున్నారు. శివరాత్రి పర్వదినం వేళ మల్లన్న వేడుకను కనులారా చూసేందుకు భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో పురవీధులు, పాతాళగంగ జనసంద్రాన్ని తలపిస్తోంది.కృష్ణమ్మ చెంత పుణ్యస్నానాలు ఆచరించి, భ్రామరీ సమేత మల్లన్న దర్శనానికి పోటెత్తారు. శివరాత్రి ఘడియలు సమీపిస్తుండటంతో శ్రీగిరిలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
బ్రహ్మమురారి.. సురార్చితలింగం


