బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Feb 15 2026 6:54 AM | Updated on Feb 15 2026 6:54 AM

బాంబ్

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షేత్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. శ్రీశైలానికి వచ్చే రహదారి మార్గాల్లో కల్వర్టులు, ఘాట్‌ రోడ్‌ టర్నింగ్‌ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శివదీక్ష శిబిరాలు, చంద్రావతి కల్యాణ మండపం, ఆలయ ప్రాంగణం దర్శన క్యూలు అతిథి గృహాలు, సత్రాలు వద్ద తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు.

బస్సులు కిటకిట

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతు న్నా ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దోర్నాలకు చేరుకున్న భక్తులు శ్రీశైలం వచ్చేందుకు బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అటు ఆత్మకూరు, ఇటు మార్కాపురం, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు రద్దీగా ఉండటంతో దోర్నాల వద్ద భక్తులు ఎక్కలేకపోతున్నారు.

గదుల కేటాయింపులో

పర్యవేక్షణ పెంచండి

శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు వసతి గదుల కేటాయింపులో అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత పెంచాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా దేవస్థానం అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక దేవస్థానం వసతి గృహ సముదాయ కేంద్రాన్ని, జాయింట్‌ కలెక్టర్‌ కొల్లా బత్తుల కార్తీక్‌తో కలిసి సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌, డైరెక్ట్‌ కౌంటర్‌ విధానాల ద్వారా గదుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందా లేదా అనే విషయంపై సమీక్షించారు. ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా గదుల కేటాయింపు చేస్తున్నారా, ప్రత్యేక కౌంటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఉచిత, చెల్లింపు వసతి గృహాలు, సత్రాలు, డార్మిటరీల వద్ద పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. వృద్ధులు చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గదుల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. భక్తులు మధ్యవర్తులను నమ్మరాదని, అధికారిక కౌంటర్లు, ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే గదులు పొందాలని కలెక్టర్‌ సూచించారు. దేవస్థానం రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను

పూర్తి చేయాలి

కర్నూలు(సెంట్రల్‌): గుండ్రేవుల, వేదవతి, ఆర్‌డీఎస్‌ కుడి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శలు బి.గిడ్డయ్య, డి.గౌస్‌దేశాయ్‌ కోరారు. శనివారం సీఆర్‌ భవన్‌లో ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో రాజకీయ, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2018లో వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డీఎస్‌ కుడికాలువల నిర్మాణాల కోసం సీఎం చంద్రబాబునాయుడు శంకు స్థాపన చేశారన్నారు. అయితే ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నా నిధులు ఎందుకు కేటాయి ంచడంలేదని ప్రశ్నించారు. అలాగే ఓర్వకల్‌ ఇండస్ట్రీయల్‌ హబ్‌తోపాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏఐవైఎఫ్‌ నాయకులు శ్రీరాములు, శ్రీనివాసులు, బీసన్న, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్య దర్శి షాబీర్‌బాషా, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు 1
1/1

బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement