రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ధరలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ధరలు

Feb 15 2026 7:00 AM | Updated on Feb 15 2026 7:00 AM

రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ధరలు

రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ధరలు

సామాజిక సమానత్వానికి ప్రతీక దామోదరం

కర్నూలు(అగ్రికల్చర్‌): కందులు, శనగల ధర రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కందుల ధర ఇటీవల పెరిగినట్లే పెరిగి పడిపోతోంది. శనగల ధర రోజురోజుకు పతనమవుతోంది. కర్నూలు మార్కెట్‌కు కందులు 824 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.7,889 లభించింది. శనగలు మార్కెట్‌కు 476 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.5,219 లభించగా.. సగటు ధర రూ.5,169 నమోదైంది. ఇటీవల మురిపించిన వేరుశనగ ధర మళ్లీ పడిపోతోంది. రికార్డు స్థాయిలో రూ.15 వేలకు చేరిన ధర ప్రస్తుతం రూ.10 వేలలోపునకు పడిపోయింది. మార్కెట్‌కు వేరుశనగ 745 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.6,400, గరిష్ట ధర రూ.9,603 లభించగా.. సగటు ధర రూ.8,259కే పరిమితమైంది. మిర్చి ధరలదీ ఇదే పరిస్థితి. బ్యాడిగ రకం మిర్చికి గరిష్టంగా రూ.27,069 లభించింది. మిగిలిన రకాలకు ధరలు అంతంతమాత్రంగానే లభించాయి. మినుములు మార్కెట్‌కు 188 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,209, గరిష్ట ధర రూ.8,200 లభించగా.. సగటు ధర రూ.7,951 పలికింది.

కర్నూలు (అర్బన్‌) : సామాజిక సమానత్వానికి ప్రతీక దామోదరం సంజీవయ్య అని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు. శనివారం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నంద్యాల చెక్‌పోస్టులో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎదగడం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆదోని పట్టణానికి చెందిన తాయప్పకు సామాజిక సంక్షేమ శాఖలో వాచ్‌మెన్‌గా నియామక పత్రాన్ని జేసీ అందజేశారు. వ్యాసరచన, క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ముందుగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, సంఘ నాయకులు రాధాకృష్ణ, జ్యోతి, సోమన్న, చంద్రప్ప, వెంకటేశ్వర్లు, శ్రీను, రాజశేఖర్‌ తదితరులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి సురేష్‌, మెప్మా పీడీ శ్రీనివాసులు, వివిధ సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement