కూర‘గాయాలు’
రబీ సీజన్‌లో కూరగాయల సాధారణసాగు 5,769 హెక్టార్లు ఉంది. అయితే టమాట 115, ఉల్లి 247, పచ్చి మిరిప 200 హెక్టార్లకే పరిమితం అయ్యింది. వంకాయ, బెండకాయ, కాకర, బీర, చెవుల తదితర కూరగాయల పంటల సాగు నామమాత్రమే. సాగు పడిపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. కూరగాయల సాగుకు 50 శాతం సబ్సిడీపై హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రబీ సీజన్ సాధారణ సాగులో 30 శాతం కూడా లేకపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయల కొరత ఉత్పన్నమయ్యే అవసరం ఉంది.
ఉల్లి పంట సాగు చేసిన దృశ్యం


